కరోనా పరీక్షల్లో మరో ముందడుగు: మేకపాటి

అమరావతి: మహమ్మారి కరోనా నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో థర్మల్‌ స్క్రీనింగ్‌ కిట్లను కూడా ఉత్పత్తి చేస్తున్నట్లు పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. తద్వారా కరోనా నిర్ధారణ పరీక్షల్లో మరో ముందడుగు వేశామని.. విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో వీటిని ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. రోజుకి 25 వేల మందికి పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి సరిపడా కిట్లు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. బుధవారం నుంచే థర్మల్‌ స్కానర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తిని నియంత్రించగలిగామన్న మేకపాటి గౌతమ్‌రెడ్డి... అన్నిరాష్ట్రాల కంటే ఏపీలోనే కరోనా స్క్నీనింగ్‌ బాగా జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులన్నీ క్వారంటైన్‌లో ఉన్నవారికి సంబంధించినవేనని తెలిపారు. (అఖిల ప్రియకు మాట్లాడే హక్కు లేదు’)